తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా మరణాలు - బ్రెజిల్​లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు

బ్రెజిల్​లో కరోనా మరణాలు కలవరపెడుతున్నాయి. ఒక్క రోజే వైరస్​ బారిన పడి 1,641 మంది మృతి చెందారు. ఇటీవల జరిగిన పలు వేడుకలే ఇందుకు కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కర్ఫ్యూ విధించాలని ఆ దేశ జాతీయ ఆరోగ్య కార్యదర్శులు పిలుపునిచ్చారు.

brazil record for covid deaths as hospitals near collapse
బ్రెజిల్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా మరణాలు

By

Published : Mar 3, 2021, 1:04 PM IST

బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అక్కడ తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలు గతేడాది మార్చి నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఒక్క రోజే కరోనా కారణంగా 1,641 మంది మృతి చెందటమే అందుకు నిదర్శనం. దీంతో దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైనట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన పలు వేడుకలే ఇందుకు కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో 80శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు దేశంలో కర్ఫ్యూ విధించాలని జాతీయ ఆరోగ్య కార్యదర్శులు పిలుపునిచ్చారు.

బ్రెజిల్‌లో కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.57లక్షల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం. మరోవైపు బ్రెజిల్‌ జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా అందరికీ టీకా అందించాలని ప్రభుత్వం యత్నిస్తోంది.

ఇదీ చదవండి: 'జూన్​ నాటికి 40% జనాభాకు కరోనా టీకా'

ABOUT THE AUTHOR

...view details