బ్రెజిల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు ఆ దేశవ్యాప్తంగా 41,828 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల్లో రష్యాను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది బ్రెజిల్. ఇప్పటివరకు 82,800 కేసులు నమోదయ్యాయి.
కరోనా మరణాల్లో రెండో స్థానానికి బ్రెజిల్ - కరోనా వైరస్ బ్రెజిల్
కరోనా మరణాల్లో బ్రెజిల్ రెండో స్థానానికి చేరింది. ఇప్పటివరకు ఆ దేశవ్యాప్తంగా 41వేల 828 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. బ్రెజిల్‌వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో ఈ వార్త ఆ దేశప్రజలను భయపెడుతోంది.
![కరోనా మరణాల్లో రెండో స్థానానికి బ్రెజిల్ Brazil now has 2nd highest COVID death total](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7595946-1105-7595946-1592019625486.jpg)
కరోనా మరణాల్లో రెండో స్థానానికి బ్రెజిల్
24 గంటల వ్యవధిలో 909 మంది మరణించారని బ్రెజిల్ అధికారులు తెలిపారు. బ్రెజిల్‌వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో ఈ వార్త అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బ్రెజిల్లో వైరస్‌కు కేంద్రబిందువుగా మారిన సావోపాలో నగరంలో దుకాణాలు, మాల్స్‌ను రోజుకు నాలుగు గంటలపాటు తెరిచేందుకు అనుమతులిచ్చారు. చిన్న పట్టణాల్లోని దుకాణాలు ఇప్పటికే రద్దీగా మారాయి.
ఇదీ చూడండి:-కరోనా విజృంభణ.. 77 లక్షలు దాటిన కేసులు