తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు చేరువలో కరోనా కేసులు - corona deaths in Brazil

కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు చేరువయ్యాయి. బ్రెజిల్​లో కొవిడ్​తో మృతి చెందిన వారి సంఖ్య లక్ష మార్క్​ దాటింది. మొత్తం కేసుల సంఖ్య కూడా 30 లక్షలపైకి చేరింది. అమెరికా సహా చాలా దేశాల్లో ఇంకా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది.

corona cases in the world
ప్రపంచవ్యాప్త కరోనా కేసులు

By

Published : Aug 9, 2020, 9:11 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభణ రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు ఉండగా.. ఇప్పుడు బ్రెజిల్​లోనూ కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. మే నెలాఖరు నుంచి ఈ దేశంలో రోజుకు సగటున 1,000 కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.

మొత్తం 3,013,369 కేసులు, 100,543 మరణాలతో బ్రెజిల్ ప్రస్తుతం ప్రపంచలోనే రెండో స్థానంలో ఉంది. 5,149,723 కేసులు, 165,070 మరణాలతో అమెరికా తొలి స్థానంలో ఉంది.

అయితే బ్రెజిల్ చెబుతున్న కరోనా కేసులు, మరణాల లెక్కలను అమెరికా సహా పలు దేశాలు తప్పుబడుతున్నాయి. సరిపడా టెస్టులు చేయకుండా.. తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. బ్రెజిల్​లో నిజానికి ఇంకా భారీగా కరోనా కేసులు, మరణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లోని దేశాలు ఇవే..

దేశం కేసులు మరణాలు
రష్యా 882,347 14,854
దక్షిణాఫ్రికా 553,188 10,210

ఇదీ చూడండి:గుడ్​న్యూస్: ఈ నెల 12న తొలి కరోనా వ్యాక్సిన్‌

ABOUT THE AUTHOR

...view details