తెలంగాణ

telangana

ETV Bharat / international

బస్సు హైజాక్​ కథ సుఖాంతం... దుండగుడు హతం

బ్రెజిల్​లో బస్సును హైజాక్​ చేసిన దుండగుడిని పోలీసులు కాల్చిచంపారు. 37 మందిని ప్రయాణికులు క్షేమంగా బయటపడటం వల్ల 4 గంటల హైడ్రామాకు తెరపడింది.

By

Published : Aug 20, 2019, 7:53 PM IST

Updated : Sep 27, 2019, 4:49 PM IST

బస్సు హైజాక్

బ్రెజిల్​ రియోడీజనీరోలో బస్సును హైజాక్​ చేసిన సాయుధుడిని పోలీసులు కాల్చి చంపారు. రియోడీజనీరో-నితోరాయి వంతెనపై 4 గంటల పాటు జరిగిన హైడ్రామాకు తెరదించారు. మొత్తం ఈ బస్సులో 37 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

4 గంటల హైడ్రామా

రియోలో ఉదయం 5.30 గంటలకు నితోరాయి పట్టణం వెళ్లే బస్సు ఎక్కాడు నిందితుడు. తుపాకీతో ప్రయాణికులను బెదిరించాడు. బస్సుకు నిప్పుపెడతానని భయబ్రాంతులకు గురిచేశాడు. సుమారు 4 గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది.

పోలీసుల భరోసా

మధ్యలో ఆరుగురిని విడుదల చేసినా 31 మంది మాత్రం చివరి వరకు బస్సులోనే ఉన్నారు. హైజాకర్​తో పోలీసులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రశాంతంగా ఉండమని, తాము మీతోనే ఉన్నామని ప్రయాణికులకు భరోసా ఇచ్చారు పోలీసులు.

వంతెనపై స్పాట్​

బస్సును అదుపులోకి తెచ్చుకునేందుకు రియో, నితోరాయి పట్టణాలను కలిపే వంతెనను ఎంచుకున్నారు అధికారులు. భారీగా పోలీసులు, సైన్యాన్ని మోహరించారు. వంతెనపైకి ఎవరూ రాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు. బస్సు రాగానే నిందితుడిని స్నైపర్లు మట్టుబెట్టారు. హైజాకర్​ ఎవరన్నదీ పోలీసులు ఇంకా బయటపెట్టలేదు.

ఇదీ చూడండి: ఛోటా రాజన్​కు 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Last Updated : Sep 27, 2019, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details