అమెరికాను 'బాంబ్' తుపాను వణికిస్తోంది. ఎడతెగని వర్షాలతో వరదలు ముంచెత్తి కొలరాడో, నెబ్రాస్కా, మిస్సోరీ, లోవా, దక్షిణ డకోటా తదితర ప్రాంతాలు నీటమునిగాయి.
మధ్యపశ్చిమ ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
నెల రోజుల వ్యవధిలో రెండోసారి వచ్చిన తుపానుతో దక్షిణ డకోటాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొలరాడో నుంచి మిన్నెసోటా మధ్య రహదారులు నీట మునిగాయి. ఫలితంగా వాహనాలు భారీగా నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.