తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్​ నిర్ణయాన్ని బలహీనతగా ప్రచారం చేయొద్దు' - IRAN

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు 'జాన్​ బోల్టన్​'... ఇరాన్​ అధికారులను హెచ్చరించారు. ఇరాన్​పై అమెరికా సైనికి దాడి విరమణ నిర్ణయాన్ని ట్రంప్​ బలహీనతగా ప్రచారం చేసుకోవద్దని హితవు పలికారు.

'చేతకాని తనం అని ప్రచారం చేస్తే తాటతీస్తాం'

By

Published : Jun 23, 2019, 8:58 PM IST

Updated : Jun 23, 2019, 9:26 PM IST

ఇరాన్‌పై సైనిక దాడిని ఉపసంహరించుకున్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని ట్రంప్​ బలహీనతగా ఇరాన్​ ప్రచారం చేసుకోవద్దని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్​ బోల్టన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం అలాంటి ప్రచారం ఆపేయాలని ఇరాన్​ అధికారులను హెచ్చరించారు బోల్టన్​.

"మధ్యప్రాచ్యంలో వేటకు ఇరాన్​కు ఎవరూ లైసెన్స్ ఇవ్వలేదు. మా సైన్యం పునరుత్తేజం పొంది అన్నింటికీ సిద్ధంగా ఉంది. ఇరాన్​పై రాగల కొన్ని వారాల్లో విధించేందుకు ట్రంప్​ ప్రతిపాదించిన నూతన ఆంక్షలపై సోమవారం ప్రకటన చేస్తాం. వేచి చూడండి."
- జాన్​ బోల్టన్​, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు

జెరూసలెంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశానికి ముందు బోల్టన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.​

Last Updated : Jun 23, 2019, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details