తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెజాన్' పరిరక్షణపై లాటిన్ అమెరికా దేశాల కసరత్తు

అమెజాన్ అరణ్యాలు కార్చిచ్చుకు ఆహుతవుతున్న నేపథ్యంలో... ఆ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు లాటిన్​ అమెరికా దేశాలు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్​లో వెనుజువెలా మినహా ఇతర దేశాలన్నీ సమావేశమవుతున్నాయి. ఆ ప్రాంత పరిరక్షణ, భవిష్యత్​పై... 'అమెజాన్​' దేశాలే నిర్ణయం తీసుకుంటాయని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో అభిప్రాయపడ్డారు.

By

Published : Aug 29, 2019, 9:58 AM IST

Updated : Sep 28, 2019, 5:06 PM IST

''అమెజాన్​' దేశాలే తమ భవిష్యత్ నిర్ణయించుకుంటాయి'

అమెజాన్ అరణ్య ప్రాంత రక్షణ, అభివృద్ధి, భవిష్యత్​ గురించి లాటిన్ అమెరికా దేశాలే నిర్ణయించుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్​ బొల్సొనారో అభిప్రాయపడ్డారు. ఇందుకోసం లాటిన్​ అమెరికా దేశాలు సెప్టెంబర్​లో సమావేశమవుతాయని ఆయన తెలిపారు.

"వెనుజువెలా మినహా అన్ని లాటిన్ అమెరికా దేశాలు సెప్టెంబర్​లో సమావేశమవుతాయి. పర్యావరణాన్ని పరిరక్షణకు మా సొంత ఏకీకృత వ్యూహంతో ముందుకు వెళ్తాం. అమెజాన్​ ప్రాంత దేశాల సుస్థిరతకు పాటుపడతాం."- బొల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు

అమెజాన్... కార్చిచ్చుకు ఆహుతి అవుతున్న వేళ... లాటిన్ అమెరికా దేశాల సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

'ఒకే ఒక్కడు' అనుకుంటున్నాడు..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్​తో... బొల్సొనారో వ్యక్తిగత వివాదం కొనసాగుతోంది.

"పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న 'ఒకే ఒక్కడు' తానేనని ఇమ్మాన్యుయెల్ మెక్రాన్​ భ్రమపడుతున్నాడు."- బొల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు

ఇప్పటికే భారీ నష్టం జరిగింది...

బ్రెజిల్​లో రైతులు, డెవలపర్లు, ఇతరులు భూమి కోసం అడవులను భారీగా తగలబెట్టారు. ఫలితంగా ఇప్పటికే భారీగా అరణ్యాలు నాశనమయ్యాయి. బ్రెజిల్ ప్రభుత్వమూ పర్యావరణ భద్రతను గాలికి వదిలేసింది. ప్రస్తుతం కార్చిచ్చు మహారణ్యాలను నాశనం చేస్తోంది.


ఇదీ చూడండి: కశ్మీర్​ నుంచి భారత్​ వెనక్కుతగ్గాలని హెచ్చరిక
!

Last Updated : Sep 28, 2019, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details