తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​ రూల్స్​ను మళ్లీ లెక్కచేయని దేశాధ్యక్షుడు! - president without mask

కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బ్రెజిల్​ ఒకటి. అలాంటిది.. ఆ దేశ అధ్యక్షుడే కరోనా నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మళ్లీ చిక్కుతున్నారు. బైకర్ల ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మాస్కు ధరించనందుకు బొల్సొనారోకు అధికారులు జరిమానా విధించారు.

Bolsonaro fined
బ్రెజిల్ అధ్యక్షుడికి ఫైన్​

By

Published : Jun 13, 2021, 1:15 PM IST

కరోనా నిబంధనలు ఉల్లంఘించి పలుమార్లు విమర్శలపాలైనబ్రెజిల్​ అధ్యక్షుడు జైర్​ బొల్సొ​నారో.. తాజాగా మరోసారి కొవిడ్​ ఆంక్షలను పక్కనపెట్టారు. సావో పాలో నగరంలో బైకర్లు నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాస్కు ధరించలేదు. దాంతో స్థానిక అధికారులు ఆయనకు జరిమానా విధించారు.

బైకర్ల కార్యక్రమంలో మాస్కు ధరించని బోల్స్​నారో

టీకా తీసుకుంటే అక్కర్లేదు..!

బైక్​​ ఎక్కిన ఆయన హెల్మెట్​ను​ అయితే ధరించారు. కానీ, మాస్కును ధరించడానికి మాత్రం నిరాకరించారు. పైగా.. 'టీకా తీసుకున్న వారికి మాస్కుతో పని లేదు' అని చెప్పారు. మాస్కు ధరించనందుకు బొల్సొనా​రోకు 110 డాలర్ల జరిమానాను విధించారని సావో పాలో ప్రభుత్వానికి చెందిన మీడియా తెలిపింది. అయితే దీనిపై బొల్సొనారో కార్యాలయం మాత్రం స్పందించలేదు.

బైకర్ల ర్యాలీలో బోల్స్​నారో

గత నెలలోనూ.. మారన్‌హవో రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాస్కు ధరించనందుకు బొల్సొనారోకు అక్కడి అధికారులు జరిమానా విధించారు.

ఇదీ చూడండి:టీకాలు కావాలని మోదీకి బ్రెజిల్‌ అధ్యక్షుడి లేఖ

ABOUT THE AUTHOR

...view details