గుడ్ ఫ్రైడే సందర్భంగా బొలివీయా, పెరూ కళాకారులు అద్భుతరీతిలో సైకతశిల్పాలు తీర్చిదిద్దారు. 'నోవాస్ ఆర్క్' ఇతివృత్తంగా తీసుకుని ఈ భారీ సైకత శిల్పాలను మలిచారు. బొలీవియాలోని ప్రసిద్ధ నగరం ఓరురోలో సుమారు 250 మంది కళాకారులు కలిసి ఏసుక్రీస్తు, శిలువ, ఏసు పునరుత్థానం, నోవా ఆర్క్ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు తీర్చిదిద్దారు. వీటిని చూడడానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు.
సైకత శిల్పాలతో కరుణామయుడి జీవితం - గుడ్ ఫ్రైడే
గుడ్ ఫ్రైడే సందర్భంగా బొలివియాలో ఒకేసారి 250 మంది కళాకారులు అద్భుత సైకత శిల్పాలను రూపొందించారు. శిల్పాలతో ఏసుక్రీస్తు జీవిత ఘట్టాలను ఆవిష్కరించారు.

సైకత శిల్పాలతో కరుణామయుడి జీవితం