ఈశాన్య బొలివియాలోని అమెజాన్ ఆడవుల్లో విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. కూలిన విమానం బొలివియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిందిగా పోలీసులు గుర్తించారు.
Plane Crash: కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం- ఆరుగురు మృతి - విమానం ప్రమాదంలో ఆరుగురు మృతి
బొలివియాలో ఓ విమానం కుప్పకూలింది (Plane Crash). ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.
కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో ఇద్దరు మిలటరీ ఫైలెట్లు, మరో నలుగురు ప్రయాణీకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అడవిలో కూలిపోవడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని అన్నారు. అయితే దగ్గరలోని అగువా డల్సే వర్గానికి చెందిన వారు మంటలను ఆర్పేందుకు ప్రత్నించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:కరోనాకు 6 లక్షల మంది బలి.. మృతులకు వినూత్న నివాళి