కరోనా కట్టడి కోసం భారత్‌కు సహాయం ప్రకటించింది ఏరోస్పేస్ దిగ్గజ సంస్థ బోయింగ్. 10 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీని భారత్‌కు అందించనున్నట్లు తెలిపింది. కరోనాతో పోరాడుతున్న వారికి వైద్య పరికరాలు అందించడం సహా ఇతర కార్యక్రమాలు చేపడుతున్న భారత్‌లోని సంస్థలకు ఈ సహాయాన్ని అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది.
బోయింగ్‌ను ప్రపంచ పౌరుడిగా అభివర్ణించిన ఆ సంస్థ సీఈఓ డేవ్ కల్హౌన్.. ఈ విపత్కర సమయంలో భారత్‌లోని ప్రజలకు తాము సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.