తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ప్రముఖ వ్యాపారవేత్త!​ - Michael Bloomberg Files Papers Paving Way For US president

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రముఖ వ్యాపారవేత్త​ మైఖేల్​ బ్లూమ్​బర్గ్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. నామపత్రం దాఖలు చివరి గడువు ముగుస్తున్న నేపథ్యంలో అలబామా రాష్ట్రంలో డెమొక్రటిక్ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో అభ్యర్థిగా పేరు నమోదు చేసుకోవటం ఇందుకు బలం చేకూరుస్తోంది.

అమెరికా అధ్యక్ష పదవి రేసులో మైకేల్ బ్లూమ్​బర్గ్!

By

Published : Nov 9, 2019, 8:47 AM IST

అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు ప్రముఖ వ్యాపారవేత్త మైఖేల్​ బ్లూమ్​బర్గ్​ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలబామా రాష్ట్రంలో డెమొక్రాటిక్ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో అభ్యర్థిగా పేరు నమోదు చేసుకున్నారు బ్లూమ్​బర్గ్.

ట్రంప్​నకు పోటీగా..!

ఇందుకు సంబంధించి బ్లూమ్​బర్గ్​ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అలబామా ఎన్నికల్లో పోటీకి మైఖేల్​ సన్నద్ధం కావడం.. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​న​కు ఎదురునిలిచే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. ట్రంప్​న​కు పోటీగా ఇప్పటికే చాలా మంది అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫలితంగా మరోసారి అధ్యక్ష పీఠం అధిరోహించాలని తహతహలాడుతున్నడొనాల్డ్​కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

చివరి నిమిషంలో..

నామపత్రం దాఖలుకు​ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు డెమొక్రాటిక్ పార్టీ తన వెబ్​సైట్​లో 17 మంది అభ్యర్థుల పేర్లలో మైఖేల్ బ్లూమ్​బర్గ్​ పేరును కూడా చేర్చింది.

ఇదీ చూడండి:నేడే అయోధ్య భూవివాదం కేసుపై తీర్పు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details