అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ఉన్న డెమొక్రాట్ మైకెల్ బ్లూమ్‌బర్గ్. అయితే జో బిడెన్‌కు తాను మద్దతిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
" డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు మూడు నెలల క్రితం నేను అధ్యక్ష రేసులోకి ప్రవేశించాను. ట్రంప్‌ను ఓడించాలనే కారణంతో ఈ రోజు రేసు నుంచి తప్పుకుంటున్నా. ఎందుకంటే రేసులో ఉండి నా లక్ష్యాన్ని సాధించడం మరింత కష్టం అవుతుంది."