తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​కు అమెరికా విదేశాంగ మంత్రి - పాలస్తీనాకు బ్లింకన్​

పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య శాంతి చర్చలకు రంగం సిద్ధం చేయడానికి పశ్చిమ ఆసియాకు వెళ్లనున్నారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్.

Blinken
ఆంటోని బ్లింకెన్

By

Published : May 24, 2021, 6:40 PM IST

Updated : May 24, 2021, 7:23 PM IST

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పశ్చిమ ఆసియాలో పర్యటించనున్నారు. పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య శాంతి ఒప్పందం దీర్ఘకాలం కొనసాగేలా చూడడమే ప్రధాన అజెండాగా ఆయా దేశాల నాయకులతో చర్చలు జరపనున్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్టు దేశాల నాయకులతో బ్లింకన్​ చర్చలు జరుపుతారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తెలిపారు. గాజాకు అందాల్సిన తక్షణ సాయంపై పశ్చిమాసియా దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తుందని చెప్పారు.

పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య చెలరేగిన ఘర్షణపై బైడెన్​ ప్రభుత్వం అనుసరించిన తీరు మొదట్లో విమర్శలకు తావిచ్చింది. ఇజ్రాయెల్​పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా చట్టసభలు సైతం డిమాండ్​ చేశాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణతో అమెరికా తన బాధ్యతను నెరవేర్చినట్లయింది.

ఇదీ చదవండి:ఇజ్రాయెల్- హమాస్ పోరుకు అడ్డుకట్ట పడినట్లేనా?

Last Updated : May 24, 2021, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details