అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఉద్యమానికి మద్దతు కూడగట్టటం సహా.. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరంలోని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం ముందు వీధిలో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' పెయింటింగ్ వేశారు. అయితే.. వారం రోజల వ్యవధిలోనే ఈ పెయింటింగ్‌పై మూడు సార్లు దాడులు జరిగాయి. పలువురు దానిని చెరిపేసేందుకు ప్రయత్నించారు.
తాజాగా ఇద్దరు మహళలు నల్ల రంగు తీసుకొచ్చి పెయింటింగ్‌ను చెరిపేందుకు ప్రయత్నించారు. సీసీటీవీలో ఈ సంఘటనను పరిశీలించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.