అమెరికా మోంటానాలోని జంతు ప్రదర్శనశాలలో ఓ ఎలుగుబంటి నీటితొట్టిలో సేదదీరుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. కరోనా నేపథ్యంలో.. పర్యటకులు లేక వెలవెలబోతున్న 'ఒరెగావ్ జూ'లో తకోడా అనే ఎలుగుబంటికి ఇలా నీటిలో ఆడే అవకాశం దక్కింది. అక్కడి సంరక్షకులు.. సుమారు 300 గాలన్ సామర్థ్యం గల టబ్‌లో నీటిని నింపి, అందులో తకోడా సంబంధిత బొమ్మలను ఉంచారు. అంతే.. ఈ భల్లూకం నీటిలోకి దిగి చక్కర్లు కొట్టింది. గంతులేస్తూ సరదా సరదాగా గడిపింది.
వైరల్ వీడియో: నీటి తొట్టిలో ఎలుగుబంటి ఆటలు - Oregon Zoo updates
కరోనా నేపథ్యంలో అమెరికాలోని పలు జంతు ప్రదర్శనశాలలను మూసివేయగా.. అక్కడి జంతువులు స్వేచ్ఛాజీవనం గడుపుతున్నాయి. ఇలా సరదాగా ఆడుతూ.. నీటితొట్టిలో సేదదీరుతున్న ఓ ఎలుగుబంటి చూపరులకు ఆకర్షిస్తోంది.
వైరల్ వీడియో: నీటి తొట్టిలో ఎలుగుబంటి ఆటలు
సరిగ్గా పదేళ్ల క్రితం మొంటానా ప్రాంతంలో ఆకలితో అలమటించి బక్కచిక్కిపోయి ఉన్న తకోడాను.. సంరక్షించిన అధికారులు జంతు ప్రదర్శనశాలకు తీసుకువచ్చారు. అదే ఇప్పుడిలా ఆడుతూ కనిపించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఒరెగావ్ జూ కొంతకాలంగా మూతపడి ఉంది.
ఇదీ చదవండి:ఆ దేశ పార్లమెంట్ సమావేశం.. పోర్నోగ్రఫీతో హ్యాక్!
Last Updated : May 8, 2020, 4:23 PM IST