నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై అమెరికా వలస వెళ్లిన వారి పిల్లలు (డాక్యుమెంటెడ్ డ్రీమర్)లకు (documented dreamers) పౌరసత్వం కల్పించే దిశగా ద్వైపాక్షిక చట్టాన్ని ప్రవేశపెట్టారు అమెరికా చట్టసభ సభ్యులు. దీంతో 2లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి చిన్నారులుగా అమెరికా వచ్చిన భారతీయులే ఉన్నారు. వారికి పౌరసత్వం ఇచ్చేందుకు వీలు కల్పిస్తోంది అమెరికా చిల్డ్రన్ యాక్ట్.
అమెరికాలో దీర్ఘకాలంగా నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాతో నివాసముంటున్న వారిపై ఆధారపడుతున్న పిల్లలను 'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' (documented dreamers) అని అంటారు. వీరిలో చాలామంది తల్లిదండ్రులు.. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్కోర్డు (green card news) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.
వారికి అండగా ఉంటాం..
అమెరికా కలలను నిజం చేసుకోవాలనుకునే చిన్నారులకు అండగా ఉంటామని అన్నారు ఈ బిల్లును ప్రవేశపెట్టిన సెనేటర్ అలెక్స్ పాడిల్లా. వలస విధానంలో ప్రభుత్వ తప్పిదాల కారణంగా వారు శిక్ష అనుభవించకూడదని పేర్కొన్నారు.