తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్ ఓడిపోతే మళ్లీ 9/11 తరహా దాడులు'

అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాలో మళ్లీ 9/11 తరహా దాడులు పునరావృతమవుతాయని బిన్ లాడెన్​ కోడలు హెచ్చరించింది. స్విట్జర్లాండ్​లో నివసిస్తున్న నూర్ బిన్​ లాడిన్​.. అధ్యక్షుడు ట్రంప్​కే తాను మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Bin Laden
9/11 తరహా దాడులు

By

Published : Sep 7, 2020, 11:08 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు మద్దతు తెలుపుతూ అల్​ఖైదా అగ్రనేత ఒసామా బిన్​ లాడెన్​ కోడలు నూర్​ బిన్​ లాడిన్​ సంచలన వ్యాఖ్యలు చేసింది. జో బైడెన్​ అధ్యక్షుడైతే అమెరికాలో సెప్టెంబర్​ 11 తరహా దాడులు పునరావృతమవుతాయని హెచ్చరించినట్లు న్యూయర్క్​ పోస్ట్ వెల్లడించింది.

స్విట్జర్లాండ్​లో నివసిస్తున్న నూర్​.. ఓ వార్తా పత్రికతో మాట్లాడటం ఇదే మొదటిసారి. తమ కుటుంబం 'లాడెన్​' పేరును 'లాడిన్​'గా వ్యవరహిస్తామని నూర్ చెప్పినట్లు తెలుస్తోంది.

"ఒబామా- బైడెన్​ నాయకత్వం సమయంలో ఐసిస్​ విస్తరించింది. ఐరోపా వరకు పాకింది. కానీ, ఉగ్రవాదులను కూకటివేళ్లతో సహా పెకిలించి అమెరికాకు విదేశీ ముప్పును తప్పించారు ట్రంప్. దాడికి పాల్పడేముందే వారిని నియంత్రించారు" అని నూర్ చెప్పినట్లు న్యూయార్క్​ పోస్ట్​ తెలిపింది.

తనకు అమెరికా అంటే ఇష్టమని తెలిపన నూర్​.. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని బలంగా ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది. అమెరికాతోపాటు పశ్చిమ దేశాల భవిష్యత్తు కోసం ట్రంప్ ఎన్నిక ముఖ్యమని అభిప్రాయపడింది. ఆయన ప్రజల కోసం ఎంతో నిబద్ధతతో కృషి చేస్తున్నారని పేర్కొంది.

అధ్యక్ష ఎన్నికలు..

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా ఈసారి మెయిల్​ ఓటింగ్​ శాతం భారీగా పెరగనుంది. అయితే, ట్రంప్ మెయిల్​ ఓటింగ్​పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఓటింగ్ వేయటం ద్వారా ఎన్నికల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి:ట్రంప్​ X బైడెన్​: వాణిజ్యంలో భారత్​ ఎంపిక ఎవరు​?

ABOUT THE AUTHOR

...view details