జెఫ్ బెజోస్ బృందం అంతరిక్ష యాత్ర ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. బెజోస్‌తో పాటు.. మొత్తం నలుగురు సభ్యుల బృందం అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరుకుంది.
జెఫ్ బెజోస్ స్పేస్ టూర్ బృందం నలుగురు సభ్యుల బృందంలో జెఫ్ బెజోస్ సోదరుడు మార్క్ బెజోస్, ప్రముఖ మహిళా పైలట్ వేలీ ఫంక్ (82), ఆలివర్ డేమన్ (18) ఉన్నారు. బెజోస్ సోదరులు కాకుండా మిగతా ఇద్దరు.. అంతరిక్షయానం చేసిన వారిలో అత్యంత పెద్ద, పిన్న వయస్కులుగా రికార్డు సృష్టించారు.
ప్రయాణం సాగిందిలా..
మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం).. పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణీత కక్షలోకి వ్యోమనౌకను చేర్చి.. రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమికి తిరిగివచ్చింది.
రోదసిలోకి దూసుకుపోతున్న బ్లూ ఆరిజిన్ నింగిలోకి దూసుకుపోతున్న బ్లూ ఆరిజిన్ ఈ వ్యోమనౌక మొత్తం 106 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణించినట్లు తెలిసింది. నెల 11న రోదసిలోకి ప్రయాణించిన.. రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షనౌక కన్నా ఇది దాదాపు 16 కిలోమీటర్లు అధికం.
ఆకాశవీధుల్లో జెఫ్ బెజోస్ బృందం 100 కిలోమీటర్ల ఎత్తులో బెజోస్ బృందం కొన్ని క్షణాల పాటు మైక్రోగ్రావిటీ స్థితి అనుభవించినట్లు బ్లూ ఆరిజిన్ వెల్లడించింది. ఆ తర్వాత.. కొన్ని నిమిషాల్లోనే వ్యోమగాములు ఉన్న క్యాప్సూల్ పేరాషూట్స్ సాయంతో సురక్షితంగా భూమిని చేరుకుంది. వెంటనే బ్లూ ఆరిజిన్ సిబ్బంది.. క్యాప్సూల్ వద్దకు చేరుకుని... బెజోస్ బృందాన్ని అభినందనల్లో ముంచెత్తారు.
అంతరిక్ష నౌక నుంచి దిగుతున్న బెజోస్ ఈ యాత్రను చారిత్రక విజయంగా అభివర్ణించింది బ్లూ ఆరిజిన్. ఇదే ఏడాది మరో రెండు సార్లు స్పేస్ టూర్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆసక్తి ఉన్నవారు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇదీ చదవండి:బెజోస్-రిచర్డ్ యాత్రల మధ్య తేడాలివే..