భారత్ నుంచి కొవిడ్ టీకా డోసులను సాయంగా అందుకున్న కెనడా తన కృతజ్ఞతను చాటుకుంది. గ్రేటర్ టొరంటోలోని బిల్బోర్డ్స్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతూ ప్రకటనలను ప్రదర్శించింది. భారత్, కెనడాల మైత్రి బంధం సుదీర్ఘకాలం కొనసాగాలని పేర్కొంది.
కెనడా టొరంటో బిల్ బోర్డులపై మోదీ - vaccine doses help to canada from india
కొవిడ్ టీకా డోసులను సాయం చేసినందుకు గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కెనడాలో కృతజ్ఞతలు వెల్లివిరిసాయి. గ్రేటర్ టొరంటోలోని బిల్బోర్డ్స్పై మోదీకి ధన్యవాదాలు చెబుతూ ప్రకటనలు ప్రదర్శించారు అక్కడి అధికారులు.
గ్రేటర్ టొరంటో బిల్బోర్డ్స్పై మోదీ ఫొటో
తమ దేశానికి కొవిడ్ టీకాలు అందించాలని గతనెలలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. మోదీకి ఫోన్ చేసి కోరారు. ఈ మేరకు గతవారంలో 50,000 డోసుల కొవిషీల్డ్ టీకాను ఆ దేశానికి భారత్ సరఫరా చేసింది.
ఇదీ చూడండి:'కొన్నేళ్లల్లో కరోనా పుట్టుకపై క్లారిటీ'
Last Updated : Mar 11, 2021, 11:13 AM IST