తెలంగాణ

telangana

ETV Bharat / international

హెచ్4 వీసాదారుల కోసం ప్రతినిధుల సభలో బిల్లు - భారతీయ మహిళలు

అమెరికాలోని హెచ్​- 4 వీసాదారుల పనిహక్కుకు భద్రత కల్పించేలా రూపొందించిన బిల్లు ప్రతినిధుల సభ ముందుకొచ్చింది. ప్రతినిధుల సభలో ఇద్దరు చట్టసభ్యులు వీసాదారుల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్​ 1బీ వీసాపై అమెరికాలో నివసించేవారి జీవిత భాగస్వాములకు హెచ్​-4 వీసాలు జారీ చేస్తారు. ఇది పనిచేసే హక్కును కల్పిస్తుంది.

హెచ్4 వీసాదారుల కోసం ప్రతినిధుల సభలో బిల్లు

By

Published : May 30, 2019, 12:30 PM IST

హెచ్​-4 వీసాదారుల పని చేసే హక్కులను కాపాడేందుకు ప్రతినిధుల సభలో కాలిఫోర్నియా చట్టసభ్యులిద్దరు బిల్లు ప్రవేశపెట్టారు. వీసాదారుల్లో అధికంగా భారతీయ అమెరికన్ మహిళలున్నారు.

ఈ నెలలో హెచ్​-4 వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగం చేసే హక్కును తొలగిస్తామని అమెరికా హోం శాఖ(డీహెచ్​ఎస్​) ప్రకటించిన కొన్నాళ్లకే ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

హెచ్​1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారి జీవితభాగస్వాములు ఉద్యోగం చేసేందుకు హెచ్​4-ఈఏడీ నిబంధనతో అనుమతి లభిస్తుంది. వీరిలో అధికంగా భారత్​కు​ చెందిన మహిళలే ఉంటారు. వీరందరు ఎంతో నైపుణ్యమున్న వృత్తినిపుణులు. డిహెచ్​ఎస్​ ప్రస్తుత నిబంధనలతో లక్ష మందికిపైగా ఉద్యోగులకు పని చేసే హక్కు లభించింది.

ఎందరో హెచ్​-4 వీసాదారులు గ్రీన్​కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ వీసాదారులు తమకు ఇష్టమైన ఉద్యోగాలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న డీహెచ్​ఎస్​ నిబంధనలు అనుమతిస్తున్నాయి. కానీ వీటిని మార్చడానికి చర్యలు చేపడుతున్నట్టు ట్రంప్​ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.

ఇదీ చూడండి- WC19: భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details