ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ సంచలన ప్రకటన చేశారు. 27 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని ఇరువురు కలిసి నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
వివాహ బంధానికి ముగింపు పలికిన బిల్గేట్స్ - బిల్గేట్స్ మిలిందా గేట్స్
వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ప్రకటన చేశారు. దంపతులుగా తాము ఇక కొనసాగలేమని భావిస్తున్నట్లు తెలిపారు.
వివాహ బంధానికి బిల్గేట్స్ ముగింపు
"27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని మేం నిర్ణయించుకున్నాం. ముగ్గురు పిల్లలను మేం పెంచి పెద్ద చేశాం. ప్రపంచంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మెరుగైన జీవనం కల్పించే ఫౌండేషన్ను స్థాపించాం. ఈ ఫౌండేషన్ కోసం మేం కలిసి పనిచేస్తూనే ఉంటాం. కానీ, జీవితంలోని తర్వాతి దశల్లో మేం దంపతులుగా కొనసాగలేమని భావిస్తున్నాం."
-బిల్గేట్స్, మిలిందా గేట్స్ సంయుక్త ప్రకటన
Last Updated : May 4, 2021, 7:00 AM IST