జంతువులు కూడా కరోనా బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ వాటికి టీకా ప్రక్రియ మొదలుపెట్టింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్యంలోని ఒక్లాండ్లో ఉన్న జంతుప్రదర్శనశాలలో కొన్ని జంతువులకు టీకా వేశారు సిబ్బంది.
జంతువులకు కరోనా వ్యాక్సినేషన్ షురూ - జంతువులకు జోటీస్ టీకా
వ్యాధినిరోధక శక్తి పెంచేందుకు జంతువులకు టీకాలు వేస్తున్నారు. అమెరికాలోని ఒక్లాండ్లో ఓ జూలో జంతువులకు టీకా వేశారు. జంతువులకు కరోనా కూడా సోకుతుండడం కారణంగా ఈ చర్యలు చేపట్టారు.
జంతువులకు టీకా పంపిణీ
జోటీస్ అనే ఔషధ తయారీ సంస్థ ప్రత్యేకంగా జంతువుల కోసం రూపొందించిన ఈ టీకాను పులులు, ఎలుగుబంట్లు, సింహాలకు ఇచ్చినట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. జంతువుల రోగ నిరోధకశక్తి ఆధారంగా టీకాలు ఇస్తున్నట్లు వివరించారు. జోటీస్ సంస్థ ఇప్పటికే అమెరికాలోని 70 జంతుప్రదర్శనశాలలకు 11వేల టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:సముద్రంలో కూరగాయలనూ పండించేస్తున్నారు..!
Last Updated : Jul 4, 2021, 12:32 PM IST