భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్‌ను డెమోక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బైడెన్ ప్రకటించారు. ఆమెను ఎంచుకోవడం తనకు గర్వంగా ఉందన్నారు. హ్యారిస్ పోరాట యోధురాలని.. ఎంతోకాలంగా ప్రజాసేవ చేస్తున్నారని కొనియాడారు. ఆమెతో కలిసి ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లడం అనందంగా ఉందని బైడెన్ అన్నారు.
ఉపాధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తనను ఎంపిక చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కమలా హ్యారిస్ చెప్పారు. ఆయన అమెరికా ప్రజలను ఐక్యం చేయగల సమర్థవంత నాయకుడని ప్రశంసించారు. ప్రజల కోసమే బైడెన్ ఎంతోకాలంగా పోరాడుతున్నారని, మన ఆదర్శాలకు అనుగుణంగా అమెరికాను నిర్మించగలరని అన్నారు.
కమలా హారిస్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్ 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు.