తెలంగాణ

telangana

ETV Bharat / international

వచ్చే ఏడాది అమెరికా బడ్జెట్​ 6 ట్రిలియన్​ డాలర్లు

పేద, మధ్య తరగితి ప్రజల సంక్షేమార్థం వచ్చే ఏడాదికిగాను 6 ట్రిలియన్​ డాలర్ల బడ్జెట్​ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రకటించారు. అయితే.. అందులో ఇటీవల మౌలిక వసతుల కల్పన కోసం ప్రకటించిన ప్యాకేజీని జత చేస్తున్నట్లు చెప్పారు.

By

Published : May 29, 2021, 9:16 AM IST

biden
అమెరికా బడ్జెట్

అమెరికాలోని పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా.. వచ్చే ఏడాదికిగాను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ 6 ట్రిలియన్​ డాలర్ల భారీ బడ్జెట్​ను ప్రకటించారు. కానీ, ఇప్పటికే.. అప్పుల్లో కూరుకుపోయిన అగ్రరాజ్యాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆయన పన్నులు చెల్లించే కార్పొరేట్​ సంస్థలు, సంపన్నులపై ఆధారపడినట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణ కోసం ఈ ఏడాది ప్రారంభంలో అధిక ఖర్చులు వెచ్చించి విజయం సాధించిన బైడెన్​.. శనివారం ప్రకటించిన బడ్జెట్​లో ఇటీవల మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించిన ప్యాకేజీని జత చేస్తున్నట్లు చెప్పారు.

అప్పుల భారం..

ఈ ఏడాది అమెరికా లోటు రికార్డు స్థాయిలో 3.7 ట్రిలియన్​ డాలర్లుగా ఉందని అంచనా. అయితే తాజా బడ్జెట్​ ప్రణాళికతో అది వచ్చే ఏడాదికి 1.8 ట్రిలియన్​ డాలర్లకు పడిపోతుందని.. అయినా కరోనా ముందు రోజులకంటే రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే 5 ట్రిలియన్​ డాలర్ల నిధులను కొవిడ్ సంక్షోభం ఉపశమనం కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. త్వరలోనే అమెరికా అప్పులు 30 ట్రిలియన్​ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఫలితంగా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి డాలరుకు 50 సెంట్లను అప్పు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

కష్టపడి పనిచేసే వారి కోసమే..

ఆర్థిక వృద్ధి సాధించటానికి.. పై నుంచి కిందకు వెళ్లడం ఉత్తమమైనమార్గం కాదన్న బైడెన్​.. కింద నుంచి పైకి వెళ్లటమే సరైన మార్గమని తన బడ్జెట్​ సందేశంలో తెలిపారు. ఎవరైతే.. ప్రతిరోజు కష్టపడి పని చేసి, తమ కుటుంబాలను పోషిస్తారో, ఎవరైతే పన్నులను సకాలంలో చెల్లిస్తూ.. దేశానికి సేవ చేస్తారో వారి శ్రేయస్సు కోసం ఈ బడ్జెట్​ను రూపొందించామని ఆయన పేర్కొన్నారు.

రాబోయే ఎనిమిదేళ్లలో మౌలిక రంగ అభివృద్ధికి 2.3 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీని బైడెన్​ ఇటీవల ప్రకటించారు. అమెరికాలోని కుటుంబాల కోసం 1.8 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీ, అమెరికా రక్షణ వ్యవస్థ కోసం 1.5 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. వీటిని తాజా బడ్జెట్​లో జత చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:అమెరికా రక్షణ మంత్రితో జై శంకర్ భేటీ

ABOUT THE AUTHOR

...view details