అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి బైడెన్‌లు హోరాహోరీగా తలపడుతున్నారు. తాజాగా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక రాష్ట్రాలైన మిషిగన్, విస్కాన్సిన్‌లో గెలుపొందారు. ఇక్కడ వరుసగా 16, 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అంతకుముందు బైడెన్ మరో కీలక రాష్ట్రం అరిజోనాలోనూ విజయం సాధించారు. అయితే విస్కాన్సిన్ ఫలితాల్లో అనేక సందేహాలు ఉన్నాయని వెంటనే రీకౌంటింగ్ చేపట్టాలని ట్రంప్ సూచించినట్లు రిపబ్లిక్ ప్రచార నిర్వాహకుడు పేర్కొన్నారు.
మెజారిటీకి చేరువలో బైడెన్- మిషిగన్లో విజయం - అమెరికా అధ్యక్ష ఓటింగ్
డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ శ్వేతసౌధాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 270కి దగ్గర్లో ఉన్నారు. తాజాగా కీలకమైన మిషిగన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఆయన జయకేతనం ఎగురవేశారు.
మెజారిటీకి చేరువలో బైడెన్- విస్కాన్సిస్లో విజయం
538 ఎలక్టోరల్ ఓట్లలో ప్రస్తుతం ట్రంప్ 214 గెలుచుకున్నారు. ప్రత్యర్థి బైడెన్ 264 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ 270కి చేరువలో ఉన్నారు. మరో రాష్ట్రం నెవాడాలో బైడెన్ ముందంజలో ఉన్నారు. జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.
Last Updated : Nov 5, 2020, 4:11 AM IST