తెలంగాణ

telangana

ETV Bharat / international

'బైడెన్​ నంబర్​ వన్​ అధ్యక్షుడు అవుతారు' - world will respect biden by kamla

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్​పై కమలా హారిస్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటివరకు ఉన్న అమెరికా అధ్యక్షుల్లో బైడెన్​ గొప్ప నాయకుడని అన్నారు.

Biden will be a president who represents the best in us: Kamala Harris
'బైడెన్​నే నెంబర్​ వన్​ అధ్యక్షుడు'

By

Published : Nov 28, 2020, 1:30 PM IST

అమెరికాకు అత్యుత్తమమైన నాయకత్వం వహించే విధంగా జో బైడెన్​ వ్యవహరిస్తారని కమలా హారిస్​ అన్నారు. ఇప్పటి వరకు పాలించిన నాయకుల్లో బైడెన్​ నంబర్​ వన్​గా నిలుస్తారని కితాబిచ్చారు. అందుకే ప్రపంచమంతా ఆయన్ను గౌరవిస్తోందన్నారు. ఈ మేరకు కమలా ఓ ట్వీట్​ చేశారు.

"అగ్రదేశానికి అత్యుత్తమ నాయకుడు బైడెన్​. అందుకే ఆయన్ను ప్రపంచం అంతా గౌరవిస్తోంది. భావితరాలు తలెత్తుకునేలా చేస్తారు. అమెరికా సైన్యాన్ని గౌరవించి, ప్రజల ప్రాణాలు కాపాడే కమాండర్​ ఇన్​ చీఫ్​గా ఉంటారు. ఆయన దేశ ప్రజలందరి అధ్యక్షుడు.

-కమలా హారిస్​, అమెరికా ఉపాధ్యక్ష విజేత

ఇదీ చూడండి: పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్​కు ఎదురుదెబ్బ

ABOUT THE AUTHOR

...view details