గతంలో ఆశించిన దాని కన్నా రెండు నెలల ముందే మే చివరి నాటికి తమ దేశంలో వయోజనులకు అందించేందుకు తగినన్ని కరోనా వ్యాక్సిన్‌లు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఫార్మసీ ప్రోగ్రాం ద్వారా నేరుగా డోసులను అందిస్తామని వెల్లడించారు. రాబోయే వారాల్లో కరోనా వ్యాక్సిన్ సరఫరాను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల గవర్నర్‌లకు బైడెన్ ప్రభుత్వం సూచించింది.
దేశవ్యాప్తంగా మరిన్ని పాఠశాలలను తిరిగి తెరవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మార్చి చివరి నాటికి.. కనీసం ఒక టీకా డోసును విద్యావంతులందరికీ పంపిణీ చేయాలని రాష్ట్రాలకు సూచించారు బైడెన్. ఇందులో ఉపాధ్యాయులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.