2022లో చైనాలో జరిగే ఒలింపిక్స్‌ను బహిష్కరించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.
చైనా.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అందుకే బీజింగ్ ఒలింపిక్స్‌ను అమెరికా బహిష్కరించాలని రిపబ్లికన్ పార్టీ నేతలు ఇది వరకే ఆ దేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శీతాకాల ఒలింపిక్స్‌ను కమ్యూనిస్ట్ అజెండా ప్రచారానికి డ్రాగన్ వాడుకుంటుందని రిపబ్లికన్ ముఖ్యనేత ఇండో అమెరికన్ నిక్కీ హేలీ గతంలో ఆరోపించారు. వింటర్ ఒలింపిక్స్ మాటున మానవహక్కుల ఉల్లంఘనను చైనా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై.. ఆ దేశంలో మైనారిటీ ముస్లింలుగా ఉన్నా వీఘర్లను చిత్రహింసలకు గురి చేస్తున్న తీరుపైనా.. గతంలో అనేక కథనాలు వచ్చాయి.
ఇదీ చూడండి:యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు మళ్లీ ఎన్నికైన భారత్