యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై(Corona virus) విజయానికి చేరువయ్యామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ప్రకటించారు. ఆదివారం.. అమెరికా స్వాతంత్ర్య వేడుకల(America independence day) దృష్ట్యా శ్వేతసౌధంలో సుమారు వెయ్యి మందికి ఆయన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా.. బాణసంచా వెలుగులను ఆయన కుటుంబసభ్యులతో కలిసి తిలకించారు.
కొవిడ్ నుంచి క్రమంగా బయటపడుతున్నామని, స్వాతంత్ర్య వేడుకలను అమెరికా ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైరస్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిందనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహించాలని సూచించారు.