కరోనా వైరస్ నియంత్రణకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ఆవిష్కరించారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్. మహమ్మారి నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం సహా, దీర్ఘకాలిక ఆర్థిక పతనంతో పోరాడుతున్న వ్యక్తులు, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు, వ్యాపారాలకు.. ఆర్థిక సహాయం అందించేందుకు ఈ ప్రణాళికను ఆవిష్కరిస్తున్నారు.
1.9 ట్రిలియన్ డాలర్లతో బైడెన్ ఆర్థిక ప్రణాళిక
కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక స్థిరత్వం కోసం 'అమెరికన్ రెస్క్యూ ప్లాన్' పేరిట 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ఆవిష్కరించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. దీని ద్వారా పాలన చేపట్టిన 100 రోజుల్లో వంద మిలియన్ల టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్
'అమెరికన్ రెస్క్యూ ప్లాన్' పేరిట ఈ ప్రతిపాదన చేశారు బైడెన్. దీని ద్వారా పాలన చేపట్టిన వంద రోజుల్లోగా వంద మిలియన్ల టీకాలను వేయాలని బైడెన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం మరో దఫా సహాయాన్ని అందించనున్నారు.
ఇదీ చూడండి:ట్రంప్ 'అభిశంసన'పై విచారణ ఆ రోజే!