తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్ యంత్రాంగం భద్రతా సమాచారం పంచుకోవడం లేదు' - international news telugu

డొనాల్డ్ ట్రంప్​ పరిపాలనా విభాగం నుంచి తమకు భద్రత, నిఘా వ్యవస్థలకు సంబంధించిన సమాచారం అందడం లేదని జో బైడెన్ అధికార మార్పిడి బృందం తెలిపింది. ఇది తాము ఊహించని విషయమేమి కాదని పేర్కొంది.

Biden transition team says Trump administration not sharing threat assessment, intelligence reports
'ట్రంప్ యంత్రాంగం భద్రతా సమాచారం పంచుకోవడం లేదు'

By

Published : Nov 14, 2020, 1:33 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్​, కమలా హారిస్​లకు ట్రంప్ పరిపాలనా విభాగం నుంచి భద్రత, నిఘా సమాచారం అందడం లేదని బైడెన్ అధికార మార్పిడి బృందం తెలిపింది. అయితే ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదని, అందురూ ఊహించినదేనని పేర్కొంది.

" నిఘా వర్గాల సమాచారం, వాస్తవపరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా బలగాలు, శత్రు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు వంటి అంశాలపై ట్రంప్ పరిపాలనా విభాగం బైడెన్​, హారిస్​లతో సమాచారం పంచుకోవడం లేదు. అందుకు సంబంధించిన వివరాలేవి చెప్పడం లేదు."

జెన్​ సాకీ, బైడెన్ అధికార మార్పిడి బృందం సలహాదారు.

ఈ విషయంపై ట్రంప్ యంత్రాంగంతో వాగ్వాదానికి దిగే ఆలోచన తమకు లేదని జెన్ సాకీ చెప్పారు. కీలకమైన భద్రత సమాచారం తమతో పంచుకుంటే కొవిడ్ కట్టడికి ప్రాణాళికలు రూపొందించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 6 రోజులు గడుస్తున్నా తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఆమె అన్నారు.

నవంబర్​ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులను ఆశ్రయించి భంగపాటుకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా కట్టడికి ట్రంప్​ అత్యవసర చర్యలు చేపట్టాలి'

అమెరికా కోర్టుల్లో ట్రంప్​కు తప్పని భంగపాటు

ABOUT THE AUTHOR

...view details