చట్టపరమైన వలసదారులకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించిన మూడు కార్యనిర్వాహక దస్త్రాలపై నేడు సంతకాలు చేయనున్నారు.
వీసాలపై బైడెన్ కీలక నిర్ణయాలు! - అమెరికా బైడెన్
ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన మూడు కీలక కార్యనిర్వాహక దస్త్రాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు సంతకం చేయనున్నారు. ట్రంప్ తీసుకువచ్చిన వలస విధానాలను సమీక్షించనున్నారు.
![వీసాలపై బైడెన్ కీలక నిర్ణయాలు! Biden](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10473997-thumbnail-3x2-biden.jpg)
ట్రంప్ సర్కార్ తెచ్చిన విధానంతో సరిహద్దుల వద్ద కుటుంబాలకు దూరమైన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రులకు చేరువ చేసేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నారు. చట్టపరంగా దేశంలోకి వచ్చేవారి కోసం ఇప్పుడున్న వలసవిధానాన్ని సంస్కరించేందుకు బైడెన్ సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపైనా బైడెన్ సంతకం చేస్తారని శ్వేతసౌధం తెలిపింది.
అమెరికన్ల భవిష్యత్ ఆశలు సాధించుకునే క్రమంలో వలసదారులు కీలకమైన భూమిక పోషిస్తారని బైడెన్ ఆశిస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ట్రంప్ హయాంలో దాదాపు 5,500 వలస కుటుంబాల నుంచి పిల్లల్ని వేరు చేయగా ఇప్పటికీ 600 మంది చిన్నారుల కుటుంబాలను గుర్తించాల్సి ఉంది.