US Army Corona: అమెరికాలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత ఉద్ధృతుమవుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. ఇంట్లోనే కొవిడ్-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల రాపిడ్ కిట్లతో పాటు వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్95 మాస్క్‌లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణలో ఈ చర్యలు ఉపకరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
శ్వేతసౌంధంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు అధ్యక్షుడు.
"కరోనా కేసులు గరిష్ఠంగా నమోదవుతున్న క్రమంలో మనమంతా నిరుత్సాహంతోనే నూతన ఏడాదిలోకి ప్రవేశించామని తెలుసు. ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారికే ఎక్కువ ప్రమాదం. టీకా తీసుకున్నవారు వైరస్ బారినపడినా తీవ్ర అనారోగ్యానికి గురికావటం, మరణించటం వంటివి నమోదు కావటం లేదని గణాంకాలు చెబుతున్నాయి. "
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
రంగంలోకి మిలిటరీ వైద్యులు