ప్రపంచ దేశాలకు వచ్చే ఆరు వారాల్లోగా 8 కోట్ల కొవిడ్ టీకాలు అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.
"ప్రపంచదేశాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంటే అమెరికా క్షేమంగా ఉండలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఆరువారాల్లో 80 మిలియన్ల టీకా డోసులు ప్రపంచ దేశాలకు సరఫరా చేయనున్నాం."