తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా సర్జన్​ జనరల్​గా వివేక్ మూర్తి!

అమెరికా సర్జన్​ జనరల్​గా మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నారు భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు వివేక్​ మూర్తి. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడన్​.. తన ప్రభుత్వ తదుపరి సర్జన్​ జనరల్​గా మూర్తిని ఎంపిక చేసినట్లు వాషింగ్టన్​ పోస్ట్​ తెలిపింది. నాలుగేళ్లపాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు మూర్తి.

vivek murthy
భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు వివేక్​ మూర్తి

By

Published : Dec 4, 2020, 4:09 PM IST

అమెరికా తదుపరి సర్జన్​ జనరల్​గా భారత సంతతి వైద్యుడు, తన కొవిడ్​-19 సలహాదారు అయిన డాక్టర్​ వివేక్​ మూర్తిని ఎంపిక చేశారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. ఈ మేరకు ఆయన నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలిపింది వాషింగ్టన్​ పోస్ట్​.

ప్రస్తుతం బైడెన్​ కొవిడ్​-19 సలహా బృందంలోని ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు వివేక్​ మూర్తి. ప్రజా ఆరోగ్య విభాగంలో ప్రభుత్వ చీఫ్​గా​ నాలుగేళ్ల పాటు వ్యవహరించనున్నారు. ప్రస్తుత సర్జన్​ జనరల్​ జెరోమ్​ అడమ్స్​ స్థానంలో మూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.

గతంలో ఒబామా హయాంలోనే 2014, డిసెంబర్​ 15న సర్జన్​ జనరల్​గా నియమితులయ్యారు మూర్తి. సెనేట్​లో 51-43 మెజారిటీతో ఆయన ఎంపికకు ఆమోదం లభించింది. అయితే.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2017, ఏప్రిల్​ 21న పదవి నుంచి వైదొలిగారు.

కమల చీఫ్​ ఆప్​ స్టాఫ్​గా టీనా ఫ్లూర్నోయ్​

తన శ్వేతసౌధం సీనియర్​ స్టాఫ్​లో కొత్త సభ్యులను ప్రకటించారు.. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల విజేత కమలా హారిస్​. తన చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​గా టీనా ఫ్లూర్నోయ్​ను ఎంపిక చేశారు. పబ్లిక్​ పాలసీ నైపుణ్యం, ప్రజా సేవలో వృత్తి అనుభవం ఆమెను ఈ ముఖ్యమైన పదివికి ప్రత్యేకంగా అర్హత సాధించేలా చేశాయని కొనియాడారు హారిస్​.

కమలా హారిస్​ సలహా బృందం సభ్యులు

బైడెన్​-హారిస్​ అధికార మార్పిడి బృందంలో సీనియర్​ సలహాదారుగా ఉన్న రోహిణి కోసోగ్లూను.. ఉపాధ్యక్ష దేశీయ పాలసీ సలహాదారుగా, నాన్సీ మెక్​ఎల్​డౌనీని.. జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపిక చేశా కమల.

ఇదీ చూడండి: చీఫ్​ మెడికల్​ అడ్వైజర్​గా ఫౌచీ కొనసాగింపు: బైడెన్​

ABOUT THE AUTHOR

...view details