అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్.. రిపబ్లికన్లపై మండిపడ్డారు. రిపబ్లికన్లకు ఇది పరిణతితో ఆలోచించాల్సిన సమయమన్నారు. జనవరి 6న క్యాపిటల్ అల్లర్ల సందర్భంలో.. మాస్కులు ధరించడానికి వ్యతిరేకించిన రిపబ్లికన్ నేతలపై ఈ విధంగా స్పందించారు. క్యాపిటల్ ఘటన తర్వాత ముగ్గురు డెమొక్రాట్లు సహా మరొకరు కొవిడ్ బారినపడ్డారన్న విషయాన్ని గుర్తుచేశారు.
"మా పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు మాస్కులు అందిస్తే వాటిని తిరస్కరించారు. మాస్కు ధరించడం వల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి? మీకోసం కాకపోయినా దేశం కోసమైనా మాస్కు ధరించండి. ఇది మీరు పరిణితితో ఆలోచించాల్సిన సమయం. మీరు ఎదగాల్సి ఉంది. మీ నిర్లక్ష్యం కారణంగా నలుగురు కాంగ్రెస్ సభ్యులకు కరోనా సోకింది. వారిలో ఒకరు ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకున్నారు."
-జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత.