కరోనా కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం 1.8 కోట్ల మంది నిరుద్యోగులుగా మారడంతో వారిని ఆదుకోవడానికి వివిధ చర్యలు చేపడుతూ 'అమెరికన్ ఆపద రక్షక ప్రణాళిక'ను రూపొందించారు.
అందులో భాగంగా...
- ప్రతి నిరుద్యోగికి 2,000 డాలర్లు (రూ.1.40 లక్షలు) ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. ఇప్పటికే 600 డాలర్లు ఇవ్వగా, మిగిలింది వెంటనే అందివ్వనున్నారు.
- నిరుద్యోగ బీమా కింద ఇస్తున్న సౌకర్యాల కాలపరిమితిని మరికొంతకాలం పాటు పెంచనున్నారు.
- అద్దెలు చెల్లించలేక చాలా మంది ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తుండడంతో అలా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
- చిన్న వ్యాపారాలు, అత్యవసర సేవలకు సహాయం అందించనున్నారు.
- దారిద్ర్య రేఖకు దిగువున లేకుండా చూడడం కోసం ప్రతి వారికి కనీస వేతనం కింద గంటకు 15 డాలర్లు(సుమారు రూ.1,050) చెల్లించాలి. వారానికి 40 గంటలకు మించి పనిచేయాల్సిన అవసరం లేదు.