అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్రిలియన్ డాలర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లుపై సోమవారం సంతకం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల అమెరికన్ల జీవిన విధానంలో సమూల మార్పులు వస్తాయని ఆకాంక్షించారు. ఉభయపక్షాలు సహకరిస్తే ఏం సాధించవచ్చో చెప్పేందుకు ఈ బిల్లే నిదర్శమమని పేర్కొన్నారు.
ద్రవ్యోల్భణం పెరగడం, నిరుద్యోగాలు, కరోనా మహమ్మారి, ఆర్థిక ముప్పు వంటి కారణాలతో బైడెన్ ప్రజాదరణ తగ్గుతోంది. అయితే ట్రిలియన్ డాలర్ల బిల్లుతో ఆయన పాపులారిటీ మళ్లీ పెరుగుంతందని భావిస్తున్నారు. 'అమెరికా మరోసారి మార్పు దిశగా పయనిస్తోంది. మీ జీవితాలు మరింత మెరుగుపడతాయి' అని బిల్లుపై సంతకం చేసిన తర్వాత బైడెన్ సందేశమిచ్చారు.