తెలంగాణ

telangana

ETV Bharat / international

విజయంపై తప్పుడు ప్రకటనలు చేయొద్దు: ట్రంప్​ - ట్రంప్ వర్సెస్ బైడెన్

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తు్న్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. ప్రత్యర్థి జో బైడెన్​కు హెచ్చరికలు చేశారు. ఎన్నికల్లో విజయంపై తప్పుడు ప్రకటనలు చేయొద్దని మండిపడ్డారు. తమ న్యాయపోరాటం ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్నారు.

US-ELECTION-TRUMP
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

By

Published : Nov 7, 2020, 8:18 AM IST

అధ్యక్ష పీఠం దక్కిందని తప్పుడు ప్రకటనలు చేయవద్దని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తాను కూడా అలా ప్రకటన చేయగలనని అన్నారు. న్యాయపరమైన చర్యలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని పేర్కొ్​న్నారు.

కీలక రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ.. ప్రక్రియపై వరుసగా ఆరోపణలు చేస్తు్న్నారు ట్రంప్.

ట్రంప్ ట్వీట్

"ఎన్నికల రోజు రాత్రి ఈ రాష్ట్రాల్లో నేను చాలా ఆధిక్యంలో ఉన్నా. రోజులు గడుస్తోన్న కొద్దీ ఆశ్చర్యకరంగా ఈ ఆధిక్యం మాయమైంది. మా న్యాయపోరాటం ముందుకు సాగిన కొద్దీ మా ఆధిక్యం మాకు తిరిగివస్తుంది."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష పీఠానికి డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ క్రమక్రమంగా మరింత చేరువ అవుతున్నారు. ఇప్పటికే 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. నెవాడాలో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూనే.. జార్జియా, పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌ని బైడెన్ వెనక్కి నెట్టారు. వీటిల్లో ఏ ఒక్క రాష్ట్రంలో గెలిచినా బైడెన్​కు అధ్యక్ష పదవి ఖాయం కానుంది.

ఇదీ చూడండి:అధ్యక్ష పీఠానికి అత్యంత చేరువలో జో బైడెన్!

ABOUT THE AUTHOR

...view details