తెలంగాణ

telangana

ETV Bharat / international

'మే 1 నాటికి వయోజనులందరికీ టీకా'​ - మే 1 నాటికి వయోజనులందరికీ టీకా: బైడెన్​

అమెరికాలో అర్హులైన వయోజనులందరికీ.. మే 1 నాటికి కొవిడ్​ టీకా పంపిణీ చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కేసులు వెలుగు చూసినప్పటి నుంచి ఆసియా అమెరికన్లపై జరుగుతున్న జాత్యహంకార దాడులను ఆయన ఖండించారు.

Biden sets May 1 target to have all adults vaccine-eligible
మే 1 నాటికి వయోజనులందరికీ టీకా: బైడెన్​

By

Published : Mar 12, 2021, 9:29 AM IST

Updated : Mar 12, 2021, 9:52 AM IST

అమెరికాలో కరోనా టీకా తీసుకునేందుకు అర్హులైన వయోజనులందరికీ.. మే 1 నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అమెరికాలో కరోనా కేసులు వెలుగు చూసి, ఏడాది గడుస్తున్న వేళ.. మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. మే 1కి వ్యాక్సినేషన్ పూర్తైతే.. జులై నాటికి పరిస్థితి సాదారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర యంత్రాంగాలు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

ఏడాది క్రితం అమెరికాలో వైరస్ కేసులు వెలుగు చూశాయి. అనంతరం అది నిశ్శబ్దంగా, అదుపు లేకుండా వ్యాపించింది. రోజులు, వారాలు, నెలలు తరబడి దాని ప్రభావం కొనసాగింది. ఎంతో మంది మరణించారు. ఒత్తిడి, ఒంటరితనం ఆవహించింది. చీకటిలో వెలుగు కోసం ప్రతి అమెరికన్​ చూస్తాడు. కరోనా సమయంలోనూ అమెరికా వాసులంతా అదే చేశారు.

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

కొవిడ్​ వల్ల ఎంతమంది చనిపోయారన్న వివరాల కార్డును తన పాకెట్​లో పెట్టుకుంటానని జో బైడెన్​ అన్నారు. ఇప్పటివరకు కరోనా ధాటికి 5,27,726 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, 9/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కంటే అధికంగా కరోనా వల్ల మరణించిన వారి సంఖ్యే అధికమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అలా చేసేవారు అమెరికన్లు కాలేరు..

అమెరికాయేతరులంటూ అసియా అమెరికన్లపై జరుగుతున్న దాడులను జోబైడెన్ తీవ్రంగా ఖండించారు. "పదేపదే మనలో మనం కలహించుకుంటున్నామని ఇది సరికాదని" చెప్పారు. కరోనా కట్టడిపై.. తన సర్కారు తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన జాత్యహంకార దాడులు సరికాదని అన్నారు. ప్రత్యేకంగా కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి ఆసియన్లపై దాడులు పెరిగాయని.. అలాంటి దాడులు చేసే వారు అమెరికన్లు కాజాలరని.. వెంటనే ఆపేయాలని బైడెన్ సూచించారు.

ఇదీ చూడండి:'ప్రవాస భారతీయుల కృషిని గుర్తించిన బైడెన్​'

Last Updated : Mar 12, 2021, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details