కల్లోలిత అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనల్ని ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి (9/11) ఉపసంహరించేలా ప్రణాళిక రూపొందించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రకటించారు. 2001లో సరిగ్గా అదే రోజు న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలతో దాడి చేసి భారీగా ప్రాణనష్టం కలిగించారు.
9/11 నాటికి అఫ్గాన్‌లో అమెరికా దళాల ఉపసంహరణ - అమెరికా దళాల గురించి జో బైెడెన్
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనల్ని సెప్టెంబర్ 11 నాటికి ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. 2001లో సరిగ్గా అదే రోజు న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడి చేయటం గమనార్హం.
9/11 నాటికి అఫ్గాన్‌లో అమెరికా దళాల ఉపసంహరణ
ఈ ఇరవై ఏళ్లలో అఫ్గాన్‌లో అమెరికా దళాలు అందించిన సేవలు, చేసిన త్యాగాలను బైడెన్ కొనియాడారు. సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నా దౌత్యపరంగా మద్దతును అఫ్గాన్‌కు కొనసాగిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.