తెలంగాణ

telangana

ETV Bharat / international

వైవిధ్యమైన కేబినెట్.. ఇది నా హామీ: బైడెన్ - బైడెన్

అధ్యక్షుడిగా తన పరిపాలన యంత్రాంగం పూర్తి వైవిధ్యంగా ఉంటుందని జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికాలో ఇదివరకు చూడని విభిన్నమైన కేబినెట్​ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

Biden says his administration will be most diverse ever
వైవిధ్యమైన కేబినెట్.. ఇది నా హామీ: బైడెన్

By

Published : Dec 5, 2020, 5:47 PM IST

శ్వేతసౌధంతో పాటు కేబినెట్​లోనూ తన పాలన యంత్రాంగం పూర్తి వైవిధ్యంగా ఉంటుందని అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికాలో ఇదివరకు ఎన్నడూ లేని విధమైన కేబినెట్​ను రూపొందిస్తానని ఉద్ఘాటించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు తమకు ఉన్నత స్థానాలు కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు బైడెన్.

"పూర్తి వైవిధ్యమైన కేబినెట్​ను మీరు చూడబోతున్నారు. ఏ శాఖలో ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను. కానీ, అమెరికాలో ఎప్పుడూ చూడని వైవిధ్యమైన కేబినెట్​ ఉంటుందని మీకు హామీ ఇస్తున్నా."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

పలు ఆఫ్రో అమెరికన్ బృందాలు తమ ప్రతినిధులకు.. కీలక శాఖలను అప్పగించాలని బైడెన్​ను కోరుతున్నాయి. విదేశాంగ మంత్రి, ట్రెజరీ శాఖ మంత్రి, రక్షణ మంత్రి, అటార్జీ జనరల్​ పదవులలో ఒకటి తమకు కేటాయించాలని అభ్యర్థిస్తున్నాయి.

వైవిధ్యం కోసం కరసరత్తు

అమెరికా పాలన యంత్రాంగంలో కీలకమైన హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ తదుపరి ఛైర్మన్​గా ఆఫ్రో-అమెరికన్ గ్రెగోరీ మీక్స్​ను నియమిస్తూ బైడెన్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆయన విధుల్లోకి చేరితే ఈ కమిటీకి నేతృత్వం వహించిన తొలి ఆఫ్రో-అమెరికన్​గా నిలుస్తారు. అమెరికా విదేశాంగ విధానాలు రూపొందించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది.

మరోవైపు, ఆఫీస్ ఆఫ్ మేనేజ్​మెంట్ అండ్ బడ్జెట్​ డైరెక్టర్​గా భారతీయ అమెరికన్​ నీరా టాండెన్​ను ఎంపిక చేశారు బైడెన్.

ABOUT THE AUTHOR

...view details