జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్... 20 మంది భారత సంతతి అమెరికన్లను కీలక పదవులకు ఎంపిక చేశారు. ఇందులో 13 మంది మహిళలే ఉండడం విశేషం.
బైడెన్ బృందంలో 20 మంది ప్రవాస భారతీయులు
By
Published : Jan 17, 2021, 1:48 PM IST
|
Updated : Jan 17, 2021, 2:15 PM IST
జనవరి 20న అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బైడెన్... 20 మంది ప్రవాస భారతీయులను కీలక పదవులకు నామినేట్ చేశారు. ఇందులో 13 మంది మహిళలే ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 20మందిలో 17 మంది శ్వేతసౌధం కేంద్రంగానే విధులు నిర్వర్తించనున్నారు.
వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నీరా టాండెన్, అమెరికా సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తిని బైడెన్ నామినేట్ చేశారు. అసోసియేట్ అటార్నీ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌గా వనితా గుప్తా, పౌర భద్రత, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల అండర్ సెక్రెటరీగా ఉజ్రా జయాను ప్రతిపాదించారు.
కాబోయే ప్రథమ మహిళకు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగా, డిజిటల్ డైరెక్టర్‌గా గరీమ వర్మ, డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రినా సింగ్‌ను నియమించారు. కశ్మీర్ మూలలున్న ఇద్దరికి తొలిసారిగా కీలక పదవులు దక్కాయి. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీలో పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా ఈషా షా, అమెరికా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్‌గా సమీరా ఫాజిలిని బైడెన్ నామినేట్ చేశారు. నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా రామమూర్తిని ఎంపిక చేశారు.