తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా టీకా కోసం బైడెన్ భారీగా నిధులు​ - అమెరికా భారీ ప్యాకేజీ

అమెరికా.. ప్రపంచ దేశాలకు టీకా పంపిణీ విస్తృతంగా జరిగేందుకు చేయూతను అందిస్తోంది. ఇందుకోసం భారీగా నిధులను కేటాయించనుంది. జీ7 దేశాలతో శుక్రవారం జరిగే చర్చల సందర్భంగా అధ్యక్షుడు బైడెన్ ఈ విషయాన్ని ప్రకటిస్తారు.

america
టీకా పంపిణీకు అమెరికా చేయూత

By

Published : Feb 19, 2021, 8:52 AM IST

పేద దేశాల్లో టీకా పంపిణీకి చేయూతగా.. అమెరికా నాలుగు బిలియన్​ డాలర్ల(రూ.29వేల కోట్ల)ను విరాళంగా అందించనుంది. జీ-7 దేశాల(యూకే, ఫ్రాన్స్​​, జపాన్​, కెనడా, ఇటలీ, జర్మనీ)తో శుక్రవారం జరగనున్న చర్చల సందర్భంగా అధ్యక్షుడు బైడెన్​ నిధుల మంజూరుపై ప్రకటన చేయనున్నారు. ఈ నిధులను.. 2022 చివరి నాటికి విడతల వారీగా పంపిణీ చేయనున్నట్టు శ్వేతసౌధం అధికారులు స్పష్టం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్​ కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకోవాలని సభ్య దేశాలను అధ్యక్షుడు ప్రోత్సహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సరిపడా టీకాలు అందేలా కృషి చేయడానికి అమెరికా కట్టుబడి ఉంది.

-శ్వేతసౌధం.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. కొవాక్స్​ను వ్యతిరేకించారు. డబ్ల్యూహెచ్​ఓకు ఇచ్చే నిధులను నిషేధించారు. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ట్రంప్​ చర్యలను తిరిగిరాశారు బైడెన్​. డబ్ల్యూహెచ్​ఓకు నిధులు అందివ్వడం సహా కొవాక్స్​లో అమెరికా పాలుపంచుకుంటుందని ప్రకటించారు.

అయితే అమెరికాలో ఉత్పత్తి చేసిన టీకాలను ఇతర దేశాలకు పంపిణీ చేయాలని ఆ దేశంపైన ఒత్తడి వస్తున్న నేపథ్యంలో.. కొవాక్స్​ కార్యక్రమంపై బైడెన్ పిలుపునకు​ సభ్య దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా సహా ఐరోపా దేశాలు తమ టీకా పంపిణీల్లో 5 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ గురువారం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు.

టీకాల పంపిణీ విషయంలో ప్రపంచ దేశాల వైఖరిపై ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటేరస్​ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. 130 దేశాలకు ఇప్పటివరకు ఒక్క డోసు టీకా కూడా అందలేదని తెలిపారు.

ఇదీ చదవండి :'అమెరికాకు భారత్​ కీలక రక్షణ భాగస్వామి'

ABOUT THE AUTHOR

...view details