అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో చైనా యాప్‌లైన టిక్‌టాక్, విచాట్పై విధించిన నిషేధాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. అదే సమయంలో.. సమాచార భద్రత కోసం 'యూఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సప్లై చైన్'పై కార్యనిర్వాహక ఉత్తర్వులపై కూడా ఆయన సంతకం చేశారు.
"టిక్‌టాక్, విచాట్ సహా 8 ఇతర సాఫ్ట్వేర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అధ్యక్షుడు బైడెన్ మూడు కార్యనిర్వాహక ఉత్తర్వు(ఈఓ)లపై సంతకం చేశారు."
-శ్వేతసౌధం