కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు హతమార్చి ఆదివారానికి పదేళ్లు పుర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు.
"9/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మేము సరైన నివాళులు అర్పించాము. వారిని దేశం ఎప్పుడు మరువబోదు. మన దేశంపై మరో దాడి జరగనివ్వకుండా చూసుకుంటామని, అమెరికన్లను సురక్షితంగా ఉంచడానికి కట్టుబడి ఉన్నట్టు మేము ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాము. 9/11 దాడి జరిగిన 10ఏళ్లకు మేము అఫ్గానిస్థాన్‌పై యుద్ధానికి వెళ్లాము. అల్‌ఖైదా, దాని నేతలను వెతుక్కుంటూ వెళ్లాము. లాడెన్‌ను పట్టుకున్నాము."
--- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.
పదేళ్ల క్రితం.. పాకిస్థాన్‌లో బిన్ లాడెన్ నివాసంపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దానికి నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్షత వహించారు. ఆ సమయంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.