2015 అణు ఒప్పందంపై తిరిగి చర్చలు జరపాలంటే తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలన్న ఇరాన్ డిమాండ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను తొలగించబోమని స్పష్టం చేశారు. అణు ఒప్పందంలో భాగంగా యురేనియం నిల్వలను ఇరాన్ తగ్గిస్తేనే.. ఆ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తామని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.
'అణు ఒప్పందంలో చర్చల్లో భాగంగా.. ఇరాన్‌ను తిరిగి తెరపైకి తీసుకొచ్చేందుకు.. ఆ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగిస్తారా?' అన్న ప్రశ్నకు బైడెన్.. 'లేదు' అని జవాబుచెప్పినట్టు వార్తా సంస్థ పేర్కొంది.
'మీరే తగ్గాలి...'