తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రవాస భారతీయుల కృషిని గుర్తించిన బైడెన్​' - us govt

ప్రవాస భారతీయుల కృషిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ గుర్తించి, గౌరవిస్తున్నారని శ్వేతసౌధం ప్రెస్​ సెక్రటరీ జెన్​ సాకీ తెలిపారు. అగ్రరాజ్యం ప్రగతిలో భారతీయుల పాత్ర అసామాన్యమని ఆయన కొనియాడినట్లు పేర్కొన్నారు.

Biden recognized incredible contribution of Indian American community
'ప్రవాస భారతీయుల కృషిని గుర్తించిన బైడెన్​'

By

Published : Mar 12, 2021, 8:32 AM IST

Updated : Mar 12, 2021, 9:16 AM IST

అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల అసమాన కృషిని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ గుర్తించారని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. గతవారం నాసాకు వెళ్లిన బైడెన్‌.. అక్కడి మార్స్‌ శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ .. అమెరికాలో భారతీయుల ప్రాభవం పెరిగిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ప్రవాస భారతీయుల విలువను గుర్తించడం సహా వారి పట్ల బైడెన్ తన గౌరవాన్ని చూపించారని.. జెన్ సాకీ తెలిపారు.

పర్సీవరెన్స్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన స్వాతి మోహన్ గురించి మాట్లాడిన బైడెన్‌.. తన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఓ భారతీయురాలేనని, అమెరికాలో భారతీయుల పట్టు పెరిగిందని నాసాలో అన్నారు.

ఇదీ చూడండి: కరోనా రిలీఫ్ బిల్లుపై బైడెన్ సంతకం

Last Updated : Mar 12, 2021, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details