తెలంగాణ

telangana

ETV Bharat / international

వేటు వేసిన గంటల్లోనే చర్చలకు బైడెన్​ పిలుపు - రష్యా అధ్యక్షుడు వ్లాద్​మీర్​ పుతిన్​తో ఫోన్​లో మాట్లాడిన బైడెన్​

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకుగానూ పది మంది దౌత్యవేత్తలను అగ్రరాజ్యం బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు జో బైడెన్ మీడియా ముందుకు వచ్చి రష్యాతో స్నేహగీతం ఆలపించారు. ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించుకుని సైనిక చర్యలకు దూరంగా ఉండాలన్నారు.

Biden proposes strategic stability dialogue with Russia hours after slapping sanctions
రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన అమెరికా-ఈ లోపే చర్చలు!

By

Published : Apr 16, 2021, 11:54 AM IST

రష్యాకు చెందిన పది మంది దౌత్యవేత్తలపై అమెరికా వేటు వేసిన కొద్దిసేపటిలోనే ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ చర్చల పర్వానికి తెరలేపారు. మొదట అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకుగానూ పది మంది దౌత్యవేత్తలను అగ్రరాజ్యం బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది జరిగిన గంటల వ్యవధిలోనే బైడెన్ మీడియా ముందుకు వచ్చారు.

మరికొద్దిరోజుల్లో ఐరోపాలో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఇరుదేశాలు పాల్గొంటే ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని నిర్ణయించినట్ల బైడెన్​ పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాద్​మిర్​ పుతిన్​తో ఫోన్​లో మాట్లాడినట్లు తెలిపారు.

"రష్యా అధ్యక్షుడు పుతిన్​తో ఫోన్​లో కొన్ని అంశాలపై మాట్లాడాం. భద్రత, ఆయుధ నియంత్ర వంటి వాటిపై ప్రధానంగా చర్చించాం. ఇరాన్, ఉత్తర కొరియా నుంచి అణు బెదిరింపులను ఎదుర్కొవడం, ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయడం, వాతావరణ పరిస్థితులపై కూడా శిఖరాగ్ర సమావేశంలో ఇరుదేశాలు మాట్లాడాలి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సరిహద్దులో అలజడులు, క్రిమియాలో రష్యా సైనిక నిర్మాణాలపై కూడా చర్చించాం."

- జో జైడెన్​, అమెరికా అధ్యక్షుడు

ఇరు దేశాలు సైనిక చర్యలకు దూరంగా ఉండాలని పుతిన్​ను కోరినట్లు బైడెన్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'భారతే ముఖ్యం.. పాక్​కు పరిమిత సహకారం'

ABOUT THE AUTHOR

...view details